పులిగుండాల నీటి విడుదల సాధ్యాసాధ్యాల పరిశీలన : జిల్లా ఆఫీసర్లు

పులిగుండాల నీటి విడుదల సాధ్యాసాధ్యాల పరిశీలన : జిల్లా ఆఫీసర్లు

పెనుబల్లి, వెలుగు : పులిగుండాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి నీటిని విడుదల చేసే అంశాన్ని జిల్లా ఆఫీసర్లు మంగళవారం పరిశీలించారు. పెనుబల్లి మండలంలోని పరిసర గిరిజన గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులతో వరి పంటలకు నీటి అవసరం ఏర్పడటంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర ఆదేశాల మేరకు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తదితర అధికారులు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.

నీటి విడుదల సాధ్యాసాధ్యాలను పరిశీలించి కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు. అయితే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి నీటిని విడుదల చేయవద్దని అటవీ శాఖ ఆఫీసర్లు సూచించారు. అడవిలో నీటి లభ్యత ఇప్పటికే తగ్గిపోయి వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ వీరభద్ర నాయక్‌‌‌‌‌‌‌‌, ఏవో ప్రసాదరాజు, డీఈ రామారావు తదితరులు పాల్గొన్నారు.